దేవుడిని కూడా మోసం చేస్తారా.. కొండగట్టు హుండీలో చిల్డ్రన్స్ కరెన్సీ..

దేవుడిని కూడా మోసం చేస్తారా.. కొండగట్టు హుండీలో చిల్డ్రన్స్ కరెన్సీ..

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ హుండీలో చిల్డ్రన్స్ కరెన్సీ బయటపడింది. 80 రోజులకు సంబంధించిన హుండీలను బుధవారం స్థానికంగా లెక్కించారు. ఈ సమయంలో 500 విలువైన ఐదు చిల్డ్రన్స్ కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. ఈ నోట్లను ఆకతాయిలు వేసి ఉంటారని ఆఫీసర్లు అనుమానిస్తున్నారు.

 ఈ నోట్లను తిరిగి ప్యాక్ చేసి హుండీలోనే భద్రపరిచినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మరో వైపు ప్రభుత్వం నిషేధించిన రూ. 2 వేలు, రూ. 500 నోట్లు సైతం హుండీలో వచ్చినట్లు అధికారులు చెప్పారు. మరో వైపు ఆలయంలోని హుండీల ద్వారా రూ. 1,62,16,621 వచ్చినట్లు ఈవో అంజనా రెడ్డి తెలిపారు. మిశ్రమ బంగారం, వెండిని తిరిగి హుండీలోనే భద్రపరిచినట్లు చెప్పారు.