జగిత్యాల అభివృద్ధికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల అభివృద్ధికి ప్రాధాన్యం : ఎమ్మెల్యే సంజయ్ కుమార్
  • ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జగిత్యాల రూరల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్-–నర్సింగ్ కాలేజ్ రోడ్డులో, 20వ వార్డులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరాల దృష్ట్యా యావర్ రోడ్డులో 900 మీటర్ల అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టినట్లు తెలిపారు. మార్కండేయ నగర్– యావర్ రోడ్డులో డ్రైనేజీ, రోడ్డు వెడల్పు పనులకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. 

మాస్టర్​ ప్లాన్​ప్రకారం పట్టణంలో నిర్మాణాలు చేపట్టాలన్నారు. పట్టణ అభివృద్ధిలో ప్రజలు, అధికారుల భాగస్వాములు కావాలని సూచించారు. మోతే చెరువును రూ.3.5 కోట్లతో పునరుద్ధరిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్ ఆనంద్, లీడర్లు రామచందర్ రావు, నాగభూషణం, శ్రీనివాస్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.