- జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలో ఇసుక రీచ్‌ల గుర్తింపు, తవ్వకాలపై క్షేత్రస్థాయి అధ్యయనాలు చేయాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి నిర్వహించిన ఇసుక సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో ఇసుక రీచ్‌లు అందుబాటులో లేవని వర్షాకాలం ముగిసిన తర్వాత భూగర్భ జల శాఖ ద్వారా సమగ్ర అధ్యయనం చేయించి అనువైన ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు రెవెన్యూ, పోలీస్, గనుల శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లుల్లో ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలి
కోరుట్ల: ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.
