కోరుట్ల,వెలుగు: -పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి శుక్రవారం తీర్పు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన బాలిక( మానసిక వికలాంగురాలు) పై 2020లో ఠాకూర్ అరవింద్ సింగ్ లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోరుట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్స్పెషల్ కోర్టు ఏర్పాటు చేశారు.
వాదోపవాదాల అనంతరం నిందితుడికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి రత్న పద్మావతి తీర్పు చెప్పారు. అదేవిధంగా బాధిత బాలిక కు రూ. 4 లక్షల పరిహారం అందించాలని తీర్పు ఇచ్చారు. కేసులో నిందితుడికి శిక్ష పడేలా చేసిన పీపీ రామకృష్ణ, ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రాజు, ఎస్ఐ సురేందర్ రెడ్డి, సీఎంఎస్ఎస్ఐ శ్రీకాంత్ , కోర్టు కానిస్టేబుల్ మహేశ్ ను ఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.
