
జగిత్యాల : మగవారిని ఆకర్షించి, వారితో సన్నిహితంగా మెలిగి.. ఆ తర్వాత వారి నుంచి డబ్బు, నగలు లాక్కెళుతున్న ఓ కిలాడీ లేడిని అరెస్ట్ చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు. ఆమెతో పాటు ఆమెకు సహకరిస్తోన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ సింధుశర్మ ఈ క్రైమ్ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. తన అందాన్ని ఎరచూపి.. మగవారితో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియో చిత్రీకరించి ఆ మయాలేడీ ముఠా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 మందిని మోసం చేసినట్లు వెల్లడించారు. పక్కా సమాచారంతో ముఠాను అరెస్ట్ చేశామని, వారి నుంచి
14 తులాల బంగారం, 7 వేల రూపాయల నగదు, మూడు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మగవారు కూడా గుర్తు తెలియని మహిళలతో సన్నిహితంగా ఉండవద్దని, మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సింధు శర్మ విజ్ఞప్తి చేశారు.