అర్బన్ బ్యాంకు ఎన్నికల బరిలో వెలిచాల ప్యానెల్ : ఎమ్మెల్యే సంజయ్

అర్బన్ బ్యాంకు ఎన్నికల బరిలో వెలిచాల ప్యానెల్ : ఎమ్మెల్యే సంజయ్
  • ప్యానెల్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ప్రకటించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్  

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో తాను బలపరుస్తున్న ప్యానల్‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ ఇంట్లో శుక్రవారం రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు సమావేశమై అర్బన్ బ్యాంకు ప్యానల్ అభ్యర్థుల గెలుపు విషయమై చర్చించారు. అర్బన్ బ్యాంకు ఎన్నికల్లో రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు బలపరుస్తున్న ప్యానల్ అభ్యర్థులకు తన సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఎమ్మెల్యే ప్రకటించారు. 

జగిత్యాల నియోజకవర్గం నుంచి ప్యానెల్‌‌‌‌‌‌‌‌లో ఉండేలా ఇద్దరు అభ్యర్థులను ఎమ్మెల్యే ప్రతిపాదించారు. ప్యానల్ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా తన శాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు వెలిచాల రాజేందర్ రావు వెల్లడించారు. కరీంనగర్ అర్బన్ బ్యాంకు ప్యానల్ కోసం మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు యువకులను జగిత్యాల నుంచి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపాదించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నవంబర్ 1న జరిగే అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ఖాతాదారులు తమ ప్యానెల్ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని రాజేందర్ రావు కోరారు.