దేవకీ నందన వాసుదేవ మూవీ నుండి జై బోలో కృష్ణ సాంగ్‌‌ విడుదల

దేవకీ నందన వాసుదేవ మూవీ నుండి జై బోలో కృష్ణ సాంగ్‌‌ విడుదల

‘హీరో’ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా.. తన రెండో సినిమాగా ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్‌‌ వర్మ కథను అందించాడు. ఇప్పటికే ఒక పాటను రిలీజ్ చేసిన మేకర్స్.. శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ‘జై బోలో కృష్ణ’ సాంగ్‌‌ను విడుదల చేశారు.  

భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేసిన ఈ పాటకు రఘురామ్ లిరిక్స్ రాయగా, స్వరాగ్ కీర్తన్ పాడాడు. శ్రీ కృష్ణ జన్మాష్టమి బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే ఈ పాటలో అశోక్ గల్లా లుక్ ఇంప్రెస్ చేస్తోంది. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు.  వారణాసి మానస హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు.