
సూర్య నటించి నిర్మించిన ‘జై భీమ్’ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన సినిమా అంటూ మెచ్చుకుంటున్నారు. ఓటీటీలో రిలీజైనా రికార్డు స్థాయి వ్యూస్‌ని సంపాదించి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ మూవీ. ఇప్పుడు మరో రికార్డును సృష్టించింది. ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటా బేస్)లో అత్యధిక రేటింగ్ (9.7) సాధించి మొదటి స్థానంలో నిలిచింది ‘జై భీమ్’. ఇప్పటి వరకు ‘ద షషాంక్ రిడంప్షన్’ 9.3 రేటింగ్‌తో మొదటి స్థానంలో ఉంది. ఈ డేటాబేస్ లిస్ట్‌లో ఇండియన్ మూవీస్ చాలా తక్కువగా స్థానం సంపాదిస్తాయి. అలాంటిది ‘జై భీమ్’ ఏకంగా మొదటి స్థానంలో నిలవడం నిజంగా విశేషం.