డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష

 డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ వారికి జైలు శిక్ష

మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరమని ఎన్నిసార్లు చెప్పిన మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ప్రతి రోజూ వందల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా మందుబాబుల్లో మార్పు మాత్రం రావడం లేదు. అలాంటి వారిపై పోలీసులు దృష్టి పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుంటారు. మందుబాబులకు జైలు శిక్షలు కూడా వేస్తుంటారు. ఈ విషయంలో మందు బాబులపై నాంపల్లి ట్రాఫిక్ పోలీసులు గట్టిగానే ఫోకస్ చేశారు. ఇటీవల డ్రంక్ డ్రైవ్ లు నిర్వహించారు. ఈ క్రమంలో ఐదుగురిని  కోర్టులో హాజరుపరిచారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు నిందితులకు జైలు శిక్ష విధించింది.

మందుబాబులకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. నాంపల్లి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఐదుగురికి జైల్ శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో నాలుగోసారి దొరికిన ఓ వ్యక్తికి ఏకంగా 60 రోజుల జైల్ శిక్ష విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 550 BAC వచ్చిన ఓ వ్యక్తికి 30 రోజుల జైల్ శిక్ష, డ్రంక్ అండ్ డ్రైవ్ లో 200 BAC వచ్చిన ఇద్దరికి 5 రోజుల జైల్ శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. రెండోసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి 5 రోజుల జైల్ శిక్ష విధించింది కోర్టు.