జైల్లో ఉన్న తమిళనాడు మంత్రికి ఆస్పత్రిలో చేర్చేందుకు సుప్రీం అనుమతి

జైల్లో ఉన్న తమిళనాడు మంత్రికి ఆస్పత్రిలో చేర్చేందుకు సుప్రీం అనుమతి

రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో ఇటీవలే అరెస్టయిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి ఛాతినొప్పి రావడంతో అతన్ని ఆస్పత్రిలో చేర్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన బాలాజీని చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.

తమిళనాడుకు చెందిన విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి బాలాజీని జూన్ 14న మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఈడీ అధికారులు అరెస్టు చేశారు. జె జయలలిత నేతృత్వంలోని ఏఐఎడిఎంకే ప్రభుత్వంలో రవాణా మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంలో ఆయన్ను అరెస్టు చేశారు.