
సౌత్ సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా రాణిస్తున్న నయనతార.. షారుఖ్ ఖాన్ సినిమా ‘జవాన్’తో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే ఆమె కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది.
అదికూడా తన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కావడం విశేషం. నయనతార హీరోయిన్‌గా 2018లో వచ్చిన క్రైమ్ కామెడీ మూవీ ‘కొలమావు కోకిల’. రజినీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకుడు. కమెడియన్ యోగిబాబు కీలకపాత్ర పోషించాడు.
తెలుగులో ‘కోకో కోకిల’ పేరుతో విడుదలై మెప్పించిన ఈ మూవీ.. ‘గుడ్ లక్ జెర్రీ’ పేరుతో జాన్వీకపూర్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో రీమేక్ అయింది. ఇప్పుడీ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ రాబోతోందని అప్‌డేట్ ఇచ్చాడు యోగిబాబు.
దీన్ని కూడా నెల్సనే డైరెక్ట్ చేస్తాడని చెప్పాడు. దీంతో ఈ సీక్వెల్ ఎప్పుడు ఉండబోతోందా అని ఎదురుచూస్తున్నారు నయనతార అభిమానులు.