
వెలుగు: సిద్దిపేట జిల్లా కోహెడ మండలంకూరెల్ల గ్రామంలో జైన మతానికి చెందిన ఆనవాళ్లు లభించాయి. ఇక్కడే ఉన్న మాంధాతగుట్ట జైనుల ధ్యానక్షేత్రంగా ఉండేదని దొరికిన ఆధారాల ద్వారాతెలుస్తోంది. ఈ గుట్ట మీద జైన మత లక్షాణాలున్నవినాయక విగ్రహం, ధ్యాన భంగిమలో వర్థమానమహావీరుడి విగ్రహాన్ని కనుగొన్నారు.
ఔత్సాహిక చరిత్రకారుల బృందం సభ్యులు
ఔత్సాహిక తెలంగాణ చరిత్రకారులు అహోబిలం కరుణాకర్, సామలేటీ మహేశ్, శ్రీరామోజు హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణ ఇటీవల క్షేత్రస్థాయి లో పరిశీలన చేశారు. అక్కడున్న విగ్రహాలు,ఇతర ఆనవాళ్లను బట్టి కూరెల్ల జైన ధ్యాన విద్యాకేంద్రంగా ఉండేదని నిర్ధారిస్తున్నారు. మాంధాతగుట్ట వద్ద రాష్ట్ర కూటులనాటి సప్తమాతృకల రాతిఫలకం ఉంది. ఇక్కడికి దగ్గర్లో ఉన్న పొలంలో లభించిన వర్థమాన మహావీరుడి విగ్రహాన్ని స్థానికంగా బొర్ర కోమటిగా పిలుస్తుండగా జైన క్షేత్రాల్లోచాలా చోట్ల ఇలాగే పిలుస్తారని వారు చెప్తున్నారు.కోమటులంటే గోమఠులని, వారంతా జైనులని చరిత్ర చెబుతోంది. శ్రావణ బెళగొళలోని గోమఠేశ్వరుని నుంచే ఈ పదం వచ్చిందంటున్నారు. కూరెల్లగ్రామ పంచాయతీ వెనుక నాలుగడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పులో నీలిరంగు రాతితో చెక్కిన జైనచౌముఖి స్తంభం ఉంది. చౌముఖి స్తంభం ఉన్నచోటజైన విద్యా కేంద్రం ఉంటుందని చరిత్రలో రుజువులు కనిపిస్తున్నాయని, దీంతో కూరెల్లలో జైన మతకేంద్రమే కాక విద్యా కేంద్రంగా ఉండిఉంటుందని చెప్తున్నారు. మహావీరుని శిల్పం దొరికిన దగ్గర టెర్రకోట మట్టిపూసలు, పగడాల పూసలు, లేత ఎరుపు, నల్లరంగు కుండ పెంకులు, రాగి నాణాలు దొరికినా సెంటిమెంట్ తో వాటిని స్థానికులెవరూ భద్రపరచడంలేదు. ఈ ప్రాంతంలో తవ్వితే జైనుల కాలం నాటిఆనవాళ్లు లభిస్తున్నాయి.
14 అడుగుల పొడవు, తొమిదిన్నర అడుగుల వెడల్పున్న శాతవాహన కాలంనాటి ఇటుకలు కుప్పలుగాన్నాయి, ఒక దేవాలయానికి సంబంధించిన రాతి పునాది కట్టడం కనిపిస్తుండడం, ఒక మూల గరుడ రూపంలో బొమ్మ కనిపించడాన్ని బట్టి ఇక్కడ వైష్ణవ దేవాలయం ఉండవచ్చనివారు చెప్తున్నారు. కూరెల్ల తంగెడపల్లి గ్రామాల మధ్యఉన్న సిం గరాయకొం డలో గతంలో బౌద్ద మత ఆనవాళ్లను ఔత్సాహిక చరిత్రకారుల బృందం గుర్తిం చిం ది సిం గరాయ కొం డ వద్ద గల మోయతుమ్మె దవాగు ఒడ్డున బౌద్ద, జైన మతాలు విలిసిల్లిన ఆనవాళ్లు కనిపించాయి. క్రీస్తు పూర్వం నుంచి బౌద్దం, జైనంజమిలిగా తెలంగాణాలో వ్యాపించయనడానికి ఇవిఆధారాలని ఔత్సాహిక చరిత్ర కారుడు శ్రీరామోజుహరగోపాల్ అంటున్నా రు.