- జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండలోని సామాజిక సేవా భవన్లో జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విశ్రాంత ఉద్యోగులకు రావలసిన 5 కరవు భత్యాలు, ఈ హెచ్ ఎస్ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలను అందించాలని డిమాండ్ చేశారు. సభ్యులంతా ఐక్యమత్యంగా ఉంటూ సమస్యల సాధన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా రంగయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా యుగేందర్ రెడ్డి, ఆంజనేయులు, కృష్ణయ్య, కార్యదర్శులుగా నారాయణరెడ్డి, లింగయ్య, హుస్సేన్, ప్రచార కార్యదర్శిగా శంకర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా సంతోష్ రెడ్డి, యాదగిరి, వెంకట్ రెడ్డిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం, మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
