ప్రతి ఒక్కరు తపాలా ఇన్సూరెన్స్ చేసుకోవాలి : రఘునందస్వామి

ప్రతి ఒక్కరు తపాలా ఇన్సూరెన్స్ చేసుకోవాలి : రఘునందస్వామి

నార్కట్​పల్లి, వెలుగు: ప్రతి ఒక్కరూ తపాలా ఇన్సూరెన్స్ చేసుకోవాలని నల్గొండ డివిజన్ తపాలా సూపరింటెండెంట్​రఘునందస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని నెమ్మాని గ్రామానికి చెందిన కంచాజు వెంకన్న పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. ఇతడు మరణించడంతో  అతడి భార్య లక్ష్మి కి రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోస్ట్ ఆఫీస్ పాలసీ ద్వారా చాలా లాభాలు ఉన్నాయన్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మేనేజర్ శ్రవణ్, ఇన్​స్పెక్టర్​సైదిరెడ్డి, నెమ్మాని తపాలా అధికారి పరమేశ్, పోస్టల్​ సిబ్బంది పాల్గొన్నారు.