జైనూర్: ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలకు హక్కులు కల్పించాలి : దౌనే ప్రకాశ్

జైనూర్: ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలకు హక్కులు కల్పించాలి : దౌనే ప్రకాశ్

జైనూర్, వెలుగు: ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఎస్సీలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించాలని ఏజెన్సీ ఎస్సీ హక్కుల పోరాట సమితి జేఏసీ ఆసిఫాబాద్​ జిల్లా అధ్యక్షుడు దౌనే ప్రకాశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జైనూర్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్సీల భూములకు వెంటనే పహాణీలు జారీ చేసి, రైతు రుణాలు అందించాలని కోరారు.

జిల్లాలోని ఎస్సీలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి నిర్మించి ఇవ్వాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు రిజర్వేషన్ అమలు చేయాలని,  రాష్ట్రంలో పెరిగిన ఎస్సీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ పెంచాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మాన్ సమాజ్ జిల్లా అధ్యక్షుడు మావాడే దత్త, ఏజెన్సీ ఎస్సీ హక్కుల పోరాట సమితి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షుడు కాంబళే అశోక్, ప్రధాన కార్యదర్శి జి.శంకర్, మండల ఉపాధ్యక్షుడు సంబాజీ తదితరులు పాల్గొన్నారు.