జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలతో జైశంకర్ చర్చలు

జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలతో జైశంకర్ చర్చలు

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, ఖతార్ దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు. క్రాస్ బార్డర్ టెర్రరిజంపై భారత్ వైఖరిని ఆయాదేశాలకు ఆయన వివరించారు. ఇండియాకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు. క్రాస్ బార్డర్ టెర్రరిజంపై భారత్ తీసుకుంటున్న చర్యల గురించి స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్‌‌, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ -నోయెల్ బారోట్, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ వాడెఫుల్‌‌ తో జైశంకర్ చర్చలు జరిపారు.

టెర్రరిజాన్ని ఎట్టిపరిస్థితుల్లోను సహించబోమని ఆ దేశాలకు వివరించినట్టు చెప్పారు. జపాన్ విదేశాంగ మంత్రి తకేషి ఇవాయా, ఖతార్ ప్రధాని, విదేశాంగ మంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీతో కూడా మాట్లాడినట్టు పేర్కొన్నారు. సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల జూనియర్ మంత్రి  అదెల్‌‌ అల్‌‌జుబైర్​తో కూడా మాట్లాడినట్టు జైశంకర్ వివరించారు.