- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
నర్సంపేట, వెలుగు: ఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. నర్సంపేటలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న కోలా శంకర్ గౌడ్ ఫొటోకు డిపో ఎదుట బీసీ సంక్షేమ సంఘం, ఆర్టీసీ జేఏసీ నాయకులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామమని చెప్పారు.
శంకర్‌గౌడ్ బలిదానం వల్లే ఆర్టీసీ సమ్మె విరమణ జరిగిందని, కార్మికుల డిమాండ్లు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యమ చరిత్రలో శంకర్‌గౌడ్ త్యాగం వెలకట్టలేనిదని చెప్పారు. ఆయనఫ్యామిలీకి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరంజన్, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్, బండి స్వామి, యాదగిరి, ఉపేందర్, శ్రీనివాస్, వేణు, రవి పాల్గొన్నారు.

