బీసీలకు 60 శాతం సీట్లియ్యకుంటే బుద్ధి చెప్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు 60 శాతం సీట్లియ్యకుంటే బుద్ధి చెప్తం: జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ మేనిఫెస్టో విడుదల చేసిన జాజుల 

హైదరాబాద్, వెలుగు: బీసీలకు 60 శాతం సీట్లు ఇవ్వకుంటే ఆ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్ హెచ్చరించారు. ‘పార్టీలు మా దగ్గరకు వచ్చి.. మా సమస్యలు తెలుకోవాలి. ఏసీ రూముల్లో కూర్చొని మమ్మల్ని వినతిపత్రాలు ఇవ్వమంటే కుదరదు’ అని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో శనివారం బీసీ మేనిఫెస్టో–2023ను శ్రీనివాస్​ గౌడ్ విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీ మేనిఫెస్టోను ప్రతి రాజకీయ పార్టీ అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు, ప్రమోషన్లు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీల తరహాలోనే బీసీలకూ ఓ చట్టాన్ని తీసుకురావాలన్నారు. బీసీలకు సీఎం పదవి ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​ కుల్కచర్ల శ్రీనివాస్, తాటికొండ విక్రమ్​ గౌడ్, లింగం గౌడ్, మహేశ్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు.