సుంకిశాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నది

సుంకిశాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతున్నది
  • నివేదిక వచ్చినంక కాంట్రాక్టర్​పై చర్యలు: జలమండలి 

హైదరాబాద్ సిటీ, వెలుగు: సుంకిశాల ప్రాజెక్ట్ గోడ కూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలను జలమండలి ఖండించింది. ‘‘ఈ ఘటనపై మేం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక సమర్పించింది. కాంట్రాక్టర్‌‌‌‌కు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. టెక్నికల్​టీం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కూడా చెప్పింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు విజిలెన్స్, ఎన్​ఫోర్స్​మెంట్ డిపార్ట్​మెంట్ కూడా సుంకిశాల ఘటనపై విచారణ చేపట్టిం ది. ఈ విచారణ పూర్తయిన తర్వాత ఇచ్చే నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుంటాం” అని జలమండలి బుధవారం ప్రకటనలో పేర్కొంది. కొండపోచ‌‌‌‌మ్మ సాగ‌‌‌‌ర్ నుంచి హైద‌‌‌‌రాబాద్ కు తాగునీళ్లు తరలించేందుకు ఇప్పటి వ‌‌‌‌ర‌‌‌‌కు అంచ‌‌‌‌నాలు రూపొందించ‌‌‌‌లేదని స్పష్టం చేసింది.