టెస్టుల్లో జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు

టెస్టుల్లో  జేమ్స్ అండర్సన్ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న మొట్టమొదటి ఫాస్ల్ బౌలర్గా  చరిత్ర సృష్టించాడు. న్యూజీలాండ్తో జరుగుతున్న రెండో టెస్టులో అండర్సన్ ..టామ్ లాథమ్ను ఔట్ చేయడం ద్వారా ఈ రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గానూ అండర్సన్ నిలిచాడు. 2003లో టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అండర్సన్ ఇప్పటి వరకు 171 టెస్టులు ఆడి 650 వికెట్లు పడగొట్టాడు.  టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో జేమ్స్ అండర్సన్ మూడో స్థానంలో ఉండగా.. 708 వికెట్లతో షేన్ వార్న్ రెండో స్థానంలో ..800 వికెట్లతో  ముత్తయ్య మురళీధరణ్ మొదటి స్థానంలో ఉన్నారు. అంతేకాదు అత్యధిక టెస్టులు ఆడిన ఫాస్ట్ బౌలర్గానూ అండర్సన్ రికార్డు క్రియేట్ చేశాడు.