పాక్ భూభాగంలో చొరబడి ఉగ్రవాదుల్ని చంపుతాం

పాక్ భూభాగంలో చొరబడి ఉగ్రవాదుల్ని చంపుతాం

భారత్  – పాక్ ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.  పీవోకేలో ఉగ్రస్థావరాల్ని ఇండియన్ ఆర్మీ విధ్వంసం చేసింది. దీంతో భారత్ పై పాక్ అవాకులు చెవాకులు పేల్చుతుంది. ఓ వైపు దాడులకు పాల్పడుతూనే భారత జవాన్లే ముందు కాల్పులు జరిపారని పాక్ బుకాయించింది. భారత కాల్పులను తిప్పికొట్టేందుకే తమ సైనికులు కాల్పులు జరిపారని, 9 మంది ఇండియన్ జవాన్లు చనిపోయారని చెప్పింది. పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇండియన్ ఆర్మీ కాల్పులు జరిపిందని, ముగ్గు రు పౌరులు చనిపోయారని చెబుతూ మన మీదే నింద వేసేందుకు ప్రయత్నించింది.

పాక్ తీరుపై ధీటుగా జమ్ము – కశ్మీర్ గవర్నర్  సత్యపాల్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు. వీవోకేలో ఉన్న ఉగ్రవాదుల్ని మట్టుబెడతాం. అవసరమైతే పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తామని హెచ్చరించారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2,050 దాడులకు పాల్పడ్డ పాక్

జులై 30న కూడా పాక్ సైనికులు తంగ్ధార్​ సెక్టార్​ వద్దే దాడులకు తెగబడ్డారు. అదృష్టవశాత్తూ ఎవరూ చనిపోలేదు. కొందరు గాయపడ్డారు. ఆస్తి నష్టం జరిగింది. అప్పటి నుంచి అక్కడి జనం భయం గుప్పి ట్లో బతుకుతున్నా రు. ఈ ఏడాది ఇప్పటిదా కా పాక్ 2,050 సార్లు కాల్పుల విరమణను ఉల్లం ఘించిం ది. గత మూడు నెలల్లో పాక్ 895 సార్లు కాల్పులు జరిపింది. జులైలో 296 సార్లు, ఆగస్టులో 307, సెప్టెం బర్​లో 292 సార్లు కాల్పులకు తెగబడింది. 21 మంది సామాన్య జనాన్ని పొట్టనబెట్టు కుంది. 2017, 2018లోని అవే నెలలతో పోలిస్తే పాక్ ఇప్పుడు కయ్యానికి కాలు దు-వ్వుతు న్న ఘటనలు చాలా ఎక్కువ. 2017, 2018 జులైలో వరుసగా 68, 13, ఆగస్టులో 108, 44,సెప్టెం బర్​లో 101, 102 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడిచింది.