లోయలో పడిన టిప్పర్..ముగ్గురు మృతి

లోయలో పడిన టిప్పర్..ముగ్గురు మృతి

జమ్మూ కశ్మీర్ ఉధంపూర్ జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  డూడు ప్రాంతంలో టిప్పర్  వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. 

ఆగస్టు 23వ తేదీ అర్థరాత్రి ఈ  ఘటన జరిగింది.  సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు  రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే వాహనం కింద చిక్కుకుపోయి గాయపడిన వ్యక్తిని స్థానికులు రక్షించారు. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించారు.