సాయం కోరిన మాజీ సీఎం.. ముందుకొచ్చిన సోనూ సూద్

సాయం కోరిన మాజీ సీఎం.. ముందుకొచ్చిన సోనూ సూద్
  • మామను ఆదుకోవాలంటూ ట్విట్టర్‌లో ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి
  • స్పందించిన సోనూ సూద్

శ్రీనగర్: ప్రముఖ నటుడు సోనూ సూద్ నటనతోనే గాక తన సేవాగుణంతో కూడా అందరి మనసుల్ని గెల్చుకుంటున్నాడు. గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో వలస కూలీలను సొంతిళ్లకు చేర్చడంలో విశేష కృషి చేసిన సోనూ.. ఇప్పుడు కూడా కరోనాతో బాధపడుతున్న వారిని ఆదుకునేందుకు తనవంతుగా యత్నిస్తున్నాడు. అందుకే సాధారణ ప్రజానీకం తమకు సమస్యలు ఎదురైనప్పుడు సోనూకు ట్వీట్ చేస్తుంటారు. అయితే తాజాగా ట్విట్టర్ వేదికగా సాయం కోరిన ఓ రాజకీయ నేతకు కూడా సోనూ సాయమందించాడు. అయితే ఆ సాయం కోరిన నేత ఎవరో కాదు.. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కావడం గమనార్హం. ఒమర్ మామ కరోనాతో బాధపడుతున్నారు. ఆయన ఉంటున్న నొయిడాలోని గౌర్‌ సిటీలో ట్రీట్‌మెంట్ అందించేందుకు డాక్టర్ అందుబాటులో లేరట. దీంతో ప్రస్తుతం తన మామకు హెల్త్ సీరియస్‌‌గా ఉందని, ఆయనకు చికిత్స అందించాలని కోరుతూ ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. దానికి స్పందించిన సోనూ.. ఓ డాక్టర్‌ను అరెంజ్ చేస్తానని హామీ ఇచ్చి తన సేవాగుణాన్ని మరోసారి చాటుకున్నారు.