విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం

విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాద బాధితులకు పవన్ కళ్యాణ్ ఆర్థికసాయం

విశాఖ: ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్య్సకారులకు ఆర్థిక సాయం అందజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.ఒక్కొక్కరికి రూ. 50వేల చొప్పున చెక్కులు అందజేశారు పవన్. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నేను మత్స్య కార్మికులను ఓటు బ్యాంకులా చూడలేదు... అదే వైసీపీతో సహా అన్ని పార్టీలు మత్స్య కారులను ఎప్పుడు ఓటు బ్యాంకులా చూశాయి తప్పా.. ఎన్నడూ వారిని ఆదుకోలేదన్నారు. 

మీరు నాకు అన్న, తమ్ముడి లాంటి వారు.. మీకు ఏకష్టం వచ్చినా అందుబాటులో ఉంటాను అని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ప్రచారం జోరుగా సాగుతోంది.. బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.. సీరియస్ క్యాంపెయిన్ వదిలి పెట్టి మీ కష్టం లో పాలు పంచుకునేందుకు వచ్చాను... మీకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని మత్య్సకారులకు హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్.