హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి జనసేన పార్టీ తమ పూర్తి మద్దతు ప్రకటించింది. జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ మంగళవారం హైదరాబాద్‌లోని సాగర్ సొసైటీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యి ఈ మద్దతును అధికారికంగా ప్రకటించారు.
ఈ భేటీ జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు జరిగినట్లు 2 పార్టీల లీడర్లు తెలిపారు. ప్రచార వ్యూహాన్ని, భవిష్యత్ కార్యాచరణను బుధవారం ప్రకటించనున్నారు. త్వరలో పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొనే చాన్స్ ఉంది.
