
జనగామ, వెలుగు : జనగామ అగ్రికల్చర్ మార్కెట్అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు మార్కెట్చైర్మన్ బనుక శివరాజ్యాదవ్ అన్నారు. మంగళవారం నిర్వహించిన మార్కెట్పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర అదేలా కృషి చేస్తున్నామన్నారు.
కొత్త కార్యాలయ భవనం కాంపౌండ్ వాల్, సీసీ నిర్మాణం, కొత్త కవర్ షెడ్ పూర్తి, యార్డ్ లో సీసీ కెమెరాల ఏర్పాట్ల పై చర్చించినట్లు ఆయన తెలిపారు. అనంతరం మార్కెట్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జీవన్ ను సన్మానించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ కొల్లూరి నర్సింహులు, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.