ఈవీఎంలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌. శివలింగయ్య

ఈవీఎంలపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌. శివలింగయ్య

జనగామ అర్బన్, వెలుగు : ఈవీఎంలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని జనగామ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ సీహెచ్‌‌‌‌‌‌‌‌. శివలింగయ్య సూచించారు. గురువారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో అవగాహన కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ సెంటర్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఓటు హక్కు వినియోగం దాని ప్రాముఖ్యత, మనం ఓటు వేసే ప్రక్రియ గురించి తెలుసుకోవచ్చని చెప్పారు.

జిల్లాలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం నాలుగు అవగాహన సెంటర్లు, మూడు మొబైల్‌‌‌‌‌‌‌‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎలక్షన్స్‌‌‌‌‌‌‌‌ పూర్తయ్యే వరకు ఈ సెంటర్లు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ప్రపుల్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌, ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ అబ్జర్వర్‌‌‌‌‌‌‌‌ ఎతేశాం అలీ, డీటీ శంకర్ పాల్గొన్నారు.

ములుగు, వెలుగు : ఈవీఎంలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని ములుగు కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి సూచించారు. ఈవీఎంలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ను గురువారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఓటు హక్కు ప్రాధాన్యత, వినియోగాన్ని స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ వైవీ.గణేశ్‌‌‌‌‌‌‌‌, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఏవో విజయ్‌‌‌‌‌‌‌‌భాస్కర్‌‌‌‌‌‌‌‌, తహసీల్దార్‌‌‌‌‌‌‌‌ ఎం.సత్యనారాయణస్వామి పాల్గొన్నారు.