వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

 వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి :  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
  • ఇబ్బందులు ఎదురైతే ఫోన్​ చేయాలి
  •  ప్రజలకు జనగామ కలెక్టర్​ సూచన

జనగామ అర్బన్, వెలుగు: వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్​ కంట్రోల్​ రూమ్ ​నంబర్​9952308621కు ఫోన్​ చేయాలని కలెక్టర్​ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారీ వర్షాల వల్ల వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం జరిగితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.  

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కలెక్టర్​ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. రోడ్ సేఫ్టీపై గురువారం డీసీపీ రాజమహేంద్ర నాయక్​, ఏఎస్పీ పండేరి చేతన్ నితిన్ లతో కలిసి అధికారులతో కలెక్టరేట్​లో రివ్యూ చేశారు. ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్​రూల్స్​పాటించకుంటే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు.  

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

స్టేషన్​ఘన్​పూర్, వెలుగు: సీజనల్​ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ రిజ్వాన్​బాషా షేక్​ఆదేశించారు. జాఫర్​గఢ్ ​ సీహెచ్​సీని గురువారం  తనిఖీ చేశారు. నిత్యం వచ్చే పేషెంట్లు, డెలివరీల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కేజీబీవీని సందర్శించారు. వంట సరుకులను పరిశీలించారు. టెన్త్​ విద్యార్థినులతో మాట్లాడి, కడుపు నిండా ఆహారం తినాలని చెప్పారు. అంతకుముందు స్థానిక ఫర్టిలైజర్​​ షాపులను తనిఖీ చేశారు. సమస్యలున్న రైతులు కంట్రోల్​రూమ్​ ఫోన్​ నంబర్​8977745512ను సంప్రదించాలని సూచించారు.