చిన్న నీటివనరుల వివరాలు నమోదు చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

చిన్న నీటివనరుల వివరాలు నమోదు చేయాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: చిన్ననీటి వనరుల  సెన్సెస్​ పకడ్బందీగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్​ భాషా షేక్​ అన్నారు. సోమవారం కలెక్టరేట్​లో నిర్వహించిన గణాంకాల సేకరణపై అధికారులతో సమావేశం నిర్వహించి, పలు సూచనలు చేశారు. 

అంతకుముందు నిర్వహించిన గ్రీవెన్స్​లో ప్రజల నుంచి 94 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను స్పెషల్​ డ్రైవ్ ద్వారా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 13న కలెక్టరేట్ ఉద్యోగులందరికీ, ప్రింట్, ఎలక్ట్రానిక్​ మీడియా వారికి మెడికల్​క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.