కలెక్టరేట్ కు విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

 కలెక్టరేట్ కు విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

జనగామ అర్బన్, వెలుగు: సీఎం ప్రిన్సిపల్​ సెక్రటరీ శేషాద్రి సోమవారం జనగామ కలెక్టరేట్​కు విచ్చేశారు. ఆయనకు కలెక్టర్ స్వాగతం పలికారు. ఇటీవల నాస్​(నేషనల్​ అభ్యసన సామర్థ్యం) ఫలితాల్లో దేశంలో ఎంపికైన 50 జిల్లాల్లో జనగామకి చోటు దక్కింది. 

ఈ నేపథ్యంలో నాస్​ పరీక్ష కోసం కలెక్టర్​ ఆదేశాల మేరకు రూపొందించిన కార్యాచరణను పాఠశాలల్లో ఎలా అమలు చేశారో పీపీటీ ద్వారా విద్యాశాఖ అధికారులు ప్రిన్సిపల్​సెక్రటరీకి వివరించారు. కలెక్టరేట్​లో వివిధ విభాగాలు, చాంబర్లను ఎలా కేటాయించారో ఇతర అంశాలను కలెక్టర్​ వివరించారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు పింకేశ్​ కుమార్, రోహిత్​ సింగ్, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంతు నాయక్, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.