
జనగామ, వెలుగు : జనగామ శివారు పెంబర్తి చెక్‌పోస్ట్ వద్ద బుధవారం సాయంత్రం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వాహనాన్ని ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి తనిఖీ చేశారు. ఎలక్షన్ డ్యూటీలో భాగంగా నగదు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. బుధవారం చల్లా వాహనం రావడంతో పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఎస్సైలు సృజన్, తిరుపతి ఉన్నారు.