
సుహాస్, సంగీర్తన జంటగా సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జనక అయితే గనక’. దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే వర్షాలు, వరదల కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్టు బుధవారం ప్రకటించారు.
ప్రేక్షకులంతా థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన సినిమా కాబట్టి, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తాం’ అని దిల్ రాజు చెప్పారు. ‘సినిమా ఫైనల్ వెర్షన్ చూసి నచ్చడంతో యూఎస్‌ఎ రైట్స్ తీసుకున్నాను. ప్రేక్షకులు పడిపడి నవ్వుకునేలా ఉంటుంది’ అని హీరో సుహాస్ తెలిపాడు