బీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారంటూ మహిళా సర్పంచ్ ఫైర్

బీఆర్ఎస్ నేతలు వేధిస్తున్నారంటూ మహిళా సర్పంచ్ ఫైర్

కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తనును వేధిస్తున్నారని అదే పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ ఆరోపించారు. పార్టీలో ఇలాంటి నాయకులు చేసే తప్పుడు పనుల వల్ల కేసీఆర్, కేటీఆర్ లకు చెడ్డ పేరు వస్తుందని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకిపురం సర్పంచ్ కురుచపల్లి నవ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో సర్పంచులకు సహకరించి, బిల్లుల విడుదల చేయాలని ఆమె కోరారు.

సొంత పార్టీలోని కొందరు ప్రజా ప్రతినిధులు, మహిళా ప్రతినిధులు తాము చేసిన అభివృద్ధి పనుల నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని, మహిళలను వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందుకు గ్రామానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తమ సొంత భూములు, బంగారం అమ్మి పనులు చేశామని వెల్లడించారు. బిల్లులు రాకుండా కొందరు సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమపై కక్షతో అడ్డుపడుతున్నారని విమర్శించారు.