జనసేనకు 8 లేదా 9 సీట్లు మాత్రమే.. క్లారిటీ ఇస్తున్న బీజేపీ

జనసేనకు 8 లేదా 9 సీట్లు మాత్రమే.. క్లారిటీ ఇస్తున్న బీజేపీ

తెలంగాణలో బీజేపీ, జనసేన  సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేన 20 అడిగినప్పటికీ.. జనసేనకు 8 లేదా 9 సీట్లు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.  గ్రేటర్ హైదరాబాద్ లో రెండు, ఖమ్మంలో నాలుగు సీట్లు జనసేనకు  ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక సీటు, నల్లగొండలో ఒక సీటు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక సీటును జనసేనకు బిజేపీ కేటాయించినట్లు సమాచారం.

 నవంబర్ 2  లోగా జనసేన సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే..ఇవాళ బీజేపీ ఫైనల్ లిస్టును రెడీ చేయనుంది అధిష్టానం.. ఢిల్లీలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమై ఫైనల్ చేయనున్నారు. నవంబర్ 2 నుంచి నామినేషన్ల ప్రక్రియ జరగనుంది.

తెలంగాణలో టీడీపీ పోటీలో లేకపోవడంతో సెటిలర్ల ఓట్లు ఎక్కువగా జనసేనకు పడే అవకాశముందని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో జనసేనను బరిలోకి దింపాలని చూస్తోంది. 

జనసేనకు కేటాయించనున్న సీట్లు ఇవే..

  • కూకట్‌పల్లి
  • వైరా
  •  ఖమ్మం
  • .అశ్వరావుపేట
  •  కొత్తగూడెం
  •  కోదాడ
  •  తాండూరు 
  • కూకట్‌పల్లితో పాటు గ్రేటర్ లో మరో సీటు జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది.