
కూటమి నేతల మధ్య వివాదాలు కూటమిలో కలకలం రేపుతున్నాయి. భీమవరం పేకాట వ్యవహారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య వార్ కి దారి తీసింది. రఘురామ వ్యాఖ్యలను జనసేన నేత, కాపు కార్పొరేషన్ చైర్మెన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తప్పుబట్టారు. జిల్లాలో ప్రజలు పేకాట ఆడటం సర్వసాధారణమని అనడం సరికాదని అన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కాయ, కష్టం చేసుకుని జీవించే కష్ట జీవులని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీఎస్పీపై ఎంక్వైరీకి ఆదేశిస్తే... డీఎస్పీ మంచివాడంటూ రఘురామ సర్టిఫై చేయడం సమంజసం కాదని అన్నారు.
డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఏ శాఖపై అయినా ఆదేశాలు ఇచ్చే అధికారం ఉందని అన్నారు.ఎంక్వైరీలో ఉన్న అధికారిని రఘురామకృష్ణం రాజు సమర్థించడంతో ఎంక్వైరీ తప్పుదోవ పట్టే పరిస్థితి ఉందని అన్నారు.రఘురామకృష్ణంరాజుకు అభ్యంతరాలు ఉంటే పవన్ కళ్యాణ్ తో చర్చించాలని అన్నారు కొత్తపల్లి సుబ్బారాయుడు.