జనసేనతో బీజేపీకి కుదిరిన పొత్తు.. 11 స్థానాలు కేటాయింపు!

జనసేనతో బీజేపీకి కుదిరిన పొత్తు.. 11 స్థానాలు కేటాయింపు!

హైదరాబాద్: బీజేపీ, జనసేన పొత్తు, కేటాయించే స్థానాలపై దాదాపుగా ఓ క్లారిటీ వచ్చింది. 11 స్థానాలను జనసేనకు కేటాయించినట్టు సమాచారం. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కూకట్ పల్లి, శేరిలింగంపల్లి  విషయంలోనూ క్లారిటీ వచ్చిందని సమాచారం. కూకట్ పల్లి స్థానాన్ని జనసేనకు కేటాయించిన బీజేపీ.. శేరిలింగంపల్లి నుంచి బరిలోకి దిగేందుకు రెడీ అవుతోంది. 

ఇక్కడి నుంచి రవికుమార్ యాదవ్ బరిలోకి దిగుతారని తెలుస్తోంది. జనసేనాని పవన్ కల్యాణ్, ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ జాబితాను  సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కాసేపట్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.  పొత్తులో భాగంగా గ్రేటర్ పరిధిలోని కూకట్ పల్లి, మల్కాజిగిరి, నాంపల్లి స్థానాలను జనసేనకు కేటాయించినట్టు తెలుస్తోంది. 

తొలిసారిగా తెలంగాణ ఎన్నికల బరిలోకి

జనసేన ఆవిర్భవించిన తర్వాత మొదటి సారి తెలంగాణ ఎన్నికల్లో  పోటీ చేస్తుండటం విశేషం. బీజేపీకి మిత్ర పక్షంగా, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా కొనసాగిన జనసేన ఏపీలో 119 స్థానాల్లో  పోటీ చేసింది. కేవలం ఒక్క సీటును మాత్రం గెలిచింది. రాజోలు  నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాదరావు విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం వైఎస్సార్సీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. జనసేనతో దాదాపు దూరంగా ఉంటున్నారు. ఈ సారి బీజేపీతో పొత్తు పెట్టుకొని 11 చోట్ల పోటీలో ఉంటోంది. 

బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారా?

బీజేపీతో కలిసి బరిలోకి దిగుతున్న జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తారా..? కేవలం జనసేన పోటీ చేసే స్థానాల్లోనే  ప్రచార బరిలోకి దిగుతారా అన్నది సస్పెన్స్ గా మారింది. బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నందున మిగా చోట్ల క్యాంపెయిన్ చేస్తారా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ALSO READ :- అది నా తప్పే అనిపించింది.. అందుకే త్రివిక్రమ్కు సారీ చెప్పాను