హీరోయిన్ రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘జనతా బార్’. రమణ మొగిలి దర్శక నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రాన్ని నవంబర్ 28న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత రమణ మొగిలి మాట్లాడుతూ ‘స్పోర్ట్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మహిళలపై ఆ విభాగంలో ఉన్న ఉన్నతాధికారులు చేస్తున్న సెక్సువల్ హరాస్‌మెంట్‌పై పోరాడిన ఓ మహిళ కథ ఇది.
ఇందులో రాయ్ లక్ష్మీ పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు మహిళల్లో చైతన్యం నింపేలా, సమాజానికి మంచి సందేశం పంచేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. బాలీవుడ్ నటుడు శక్తికపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. అమన్ ప్రీతిసింగ్, దీక్షపంత్, అనూప్‌సోని, ప్రదీప్‌రావత్, సురేష్ భూపాల్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వినోద్ యజమాన్య సంగీతం అందించాడు.
