ఎన్టీఆర్​తో చాన్స్​..  జాన్వీ ఏమందంటే

ఎన్టీఆర్​తో చాన్స్​..  జాన్వీ ఏమందంటే

జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ విషయంలో చాలాకాలంగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్య కాలంలో అవి బలపడ్డాయి కూడా. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాతో జాన్వీ తెలుగునాట అడుగు పెడుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి కూతురు కావడంతో జాన్వీపై తెలుగు ప్రేక్షకులకు అభిమానం ఉంది. అందుకే ఈ న్యూస్ వారిని ఎక్సయిట్ చేసింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని జాన్వీ తేల్చేసింది. రీసెంట్‌‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడిందామె.

‘తెలుగు సినిమాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎన్టీఆర్‌‌‌‌ సర్‌‌‌‌తో వర్క్ చేసే చాన్స్ వస్తే అంతకంటే కావలసింది ఏముంది! ఆయన ఓ లెజెండ్. అవకాశం వస్తే ఆయనతో తప్పకుండా యాక్ట్ చేస్తా. అయితే దురదృష్టవశాత్తూ ఇంతవరకు అలాంటి ఆఫర్ నా దగ్గరకు రాలేదు. వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నా’ అంది జాన్వీ. తెలుగులోనే కాదు, ఏ సౌత్‌‌ లాంగ్వేజ్‌‌లో మంచి పాత్ర దొరికినా చేయడానికి తాను రెడీ అంది. తమిళంలో మణిరత్నం సినిమాతో ఎంట్రీ ఇస్తే చాలా బాగుంటుందని కూడా ఆశపడుతోంది. ఆమె మనసులో ఏముందో తెలిసిపోయింది కాబట్టి ఇక సౌత్ డైరెక్టర్లు ఆమెను అప్రోచ్ అవుతారేమో చూడాలి.