IPL 2024 Final: కోల్‌కతాకే సపోర్ట్.. జాన్వీ కపూర్‌ను నిరాశ పరిచిన స్టార్క్

IPL 2024 Final: కోల్‌కతాకే సపోర్ట్.. జాన్వీ కపూర్‌ను నిరాశ పరిచిన స్టార్క్

ఐపీఎల్ ఫైనల్లో హీరోయిన్ జాన్వీ కపూర్ తళుక్కున మెరిసింది. చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ తో కలిసి స్టాండ్స్‌లో సందడి చేసింది. జాన్వీ, రాజ్‌కుమార్ తమ కొత్త చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రచారంలో భాగంగా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో స్టార్క్ మిస్ చేసిన క్యాచ్ కు జాన్వీ కపూర్ ఎక్స్ ప్రెషన్స్ వైరల్ గా మారాయి. 

సునీల్ నరైన్ వేసిన 16 ఓవర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ భారీ షాట్ ఆడాడు. అయితే టైమింగ్ కుదరకపోవడంతో బంతి నేరుగా లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్న స్టార్క్ దగ్గరకు వెళ్ళింది. చేతిలోకి వచ్చిన ఈజీ క్యాచ్ ను స్టార్క్ జారవిడిచారు. అప్పటికీ సన్ రైజర్స్ 8 వికెట్లకు 97 పరుగులుగా ఉంది. 11 పరుగుల వద్ద కమ్మిన్స్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను స్టార్క్ మిస్ చేయడంతో స్టాండ్స్ లో ఉన్న జాన్వీ కపూర్ ఆశ్చర్యపోయింది. ఈజీ క్యాచ్ ను మిస్ చేసినందుకు గట్టిగా అరుస్తూ తీవ్ర నిరాశకు గురైంది. ఈ మ్యాచ్ లో జాన్వీ కేకేఆర్ కు సపోర్ట్ చేయడం విశేషం. 

Also Read:గంభీర్, షారుఖ్ ఖాన్ పాక్ సంతతి వారు: పాక్ మీడియా జర్నలిస్టు

క్యాచ్ సంగతి పక్కనపెడితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన స్టార్క్ మూడు ఓవర్లలో 14 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లే లో అభిషేక్ శర్మ, త్రిపాఠి వికెట్లు తీసి మ్యాచ్ మలుపు తిప్పిన ఈ ఆసీస్ బౌలర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. స్టార్క్ తో పాటు బౌలర్లందరూ సమిష్టిగా రాణించడంతో చెపాక్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ 113 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటి వరకు జరిగిన 17  ఫైనల్స్‌‌లో ఇదే అతి తక్కువ స్కోరు. స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్‌‌కతా 10.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి టార్గెట్‌‌ను ఛేజ్‌‌ చేసి ఈజీగా గెలిచింది.