
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ బాలీవుడ్లో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం కానుంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. జాన్వీ సిస్టర్ ఖుషీ కపూర్ సైతం సినీ ఎంట్రీ ఇవ్వనుందట. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ సూపర్ హిట్ ‘లవ్‌టుడే’కి ఇది రీమేక్‌గా తెలుస్తోంది.
ఇదే స్టోరీకి కొన్ని హంగులద్ది భారీ బడ్జెట్లో నిర్మించనున్నారట. వీరిద్దరూ ఫ్రెష్ ఫేసెస్ కావడంతో అంచనాలు లేకుండా వచ్చి హిట్ కొట్టేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ప్రదీప్ రంగనాథ్– ఇవానా జోడీకి సౌత్‌లో మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. సేమ్ టైటిల్‌తో ఈ ఏడాది సినిమాను పూర్తిచేయనున్నట్టు తెలుస్తోంది. మరి ఈ స్టార్ కిడ్స్‌తో తీస్తున్న ఈ యూత్ ఎంటర్టైనర్ హిందీ ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.