Janhvi Kapoor: స్టార్స్ని బట్టి రేటు.. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై జాన్వీ షాకింగ్ కామెంట్స్

Janhvi Kapoor: స్టార్స్ని బట్టి రేటు.. బాలీవుడ్ ఫొటోగ్రాఫర్లపై జాన్వీ షాకింగ్ కామెంట్స్

బెల్లం చుట్టూ ఈగల్లా.. స్టార్స్ ఎక్కడికి వెళ్లిన వాళ్ళని మన ఫొటోగ్రాఫర్స్ ఫాలో అవుతూనే ఉంటారు. థియేటర్స్, జిమ్, ఎయిర్పోర్ట్స్. మాల్స్ ఇలా ఎక్కడికి వెళ్లిన వాళ్ళ వెతుకుంటూ వెళ్తుంటారు ఫొటోగ్రాఫర్స్. అయితే.. చాలా మందికి వచ్చే అనుమానం ఏంటంటే ఆ స్టార్ ఆ టైంకి అక్కడికి వెళ్తున్నారని ఫొటోగ్రాఫర్లకి ఎలా తెలుస్తుంది అని. అయితే ఇదే విషయంపై తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

తాజాగా ఆమె మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలు ఉన్నప్పుడు మాత్రమే ఫోటోగ్రాఫర్స్ స్టార్స్ ను వెతుక్కుంటూ వస్తారు. సినిమా ప్రమోషన్స్ ఉంటే డబ్బులు చెల్లించి పిలిపించుకోవాలి. ఇప్పుడు నా మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహి ప్రమోషన్స్ ఉన్నాయ్ కాబట్టి వచ్చారు. కానీ, సినిమా షూటింగ్ లేనప్పుడు, నా పనిలో నేను ఉన్నప్పుడు కూడా నా కారును ఫాలో అయి ఫోటోలు తీస్తారు. వాటికి డబ్బులు తీసుకుంటుంటారు. అలా ప్రతి బాలీవుడ్ స్టార్ కి ఒక రేట్ ఉంటుంది. అందులో కూడా సూపర్ స్టార్స్ అయితే ఒక రేటు, చిన్న స్టార్స్ అయితే ఒక రేటు ఉంటుంది.. అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె తెలుగులో ఎన్టీఆర్ సరసన దేవర సినిమా చేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.