
తెలుగు, తమిళ ఇండస్ట్రీస్ నుండి ఇప్పటికే చాలా మంది డాన్స్ కొరియోగ్రాఫర్స్ హీరోలుగా చేశారు. అందులో కొంతమంది సక్సెస్ అవగా.. మరికొందరు మల్లి డాన్స్ కొరియోగ్రాపీ చేసుకుంటున్నారు. ప్రభుదేవా(Prabhudeva), రాఘవ లారెన్స్(Raghava Lawrence), అమ్మ రాజశేఖర్(Amma Rajashekhar) వంటి డాన్స్ మాస్టర్స్ ఈ కోవలోకే వస్తారు. తాజాగా ఈ లిస్టులోకి స్టార్ కొరియోగ్రాఫర్ జానీ(Jani master) కూడా చేరిపోయారు.
ఆయన హీరోగా చేస్తున్న మూవీ "రన్నర్". దర్శకుడు విజయ్ చౌదరి(Vijay Chowdary) తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుండి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో జానీ మాస్టర్ పోలీస్ గెటప్ లో కనిపిస్తున్నారు. అందులో ఓ పక్క ఖాకీ, మరోపక్క ఖద్దర్ వేసుకొని కనిపిస్తున్నారు జానీ. చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న ఈ లుక్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది.
హైదరాబాద్ లో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమా.. డిఫరెంట్ కాన్సెప్ట్ తో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాకు టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ(Manisharma) సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా.. 2023 చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరి ఈ సినిమాతో జానీ మాస్టర్ హీరోగా నిలబడతాడా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.