
అనంతపురం: తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ స్టార్ట్ అయ్యింది. పలు చోట్ల ఈవీఎం మిషన్లు మొరాయిస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లా గుత్తి బాలికల హైస్కూల్ 183వ నంబర్ పోలింగ్ బూత్ లో ఓటు వేయడానికి వచ్చిన జనసేన అభ్యర్థి మధుసూధన్ గుప్తా ఏజెంట్లతో గొడవ పడడమే కాకుండా ఈవీఎం మిషన్ ను నేలకేసి కొట్టాడు. తన నియోజకవర్గం పేరు సరిగా లేదని అక్కడున్న అధికారులతో గొడవకు దిగాడు. దీంతో పోలింగ్ అధికారుల ఫిర్యాదుతో మధుసూదన్ గుప్తాను అరెస్ట్ చేశారు.