ఇవాళ నా కల నెరవేరిన రోజు.. ఎన్టీఆర్30లో జాన్వీ కపూర్

ఇవాళ నా కల నెరవేరిన రోజు.. ఎన్టీఆర్30లో జాన్వీ కపూర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సినమా ఎన్టీఆర్30 నుంచి కొత్త అప్డేట్ వచ్చేసింది. సినిమా హీరోయిన్ పై ఇప్పటివరకు వచ్చిన రూమర్స్ ను నిజం చేస్తూ మూవీ టీం అప్ డేట్ రిలీజ్ చేసింది. ఎన్టీఆర్30 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నట్లు సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసింది. జాన్వీ కపూర్ 26వ బర్త్ డే సందర్భంగా సినిమా పోస్టర్ ను విడుదల చేసింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. శ్రీదేవి కూతురుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జాన్వీ తల్లి పేరుకు తగ్గ న్యాయం చేస్తుందా లేదా చూడాలి. 

సినిమా పోస్టర్ ను మూవీ టీంతో పాటు జాన్వీ కపూర్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘ఎన్టీఆర్ తో నటించాలన్న నా కల నెరవేరింది. బిగ్ స్క్రీన్ పై ఆయన పక్కన చూసుకోవడానికి వెయిట్ చేస్తున్నా’ అని క్యాప్షన్ పెట్టింది.  ప్రస్తుతం ఎన్టీఆర్ 30 ప్రీ ప్రోడక్షన్ వర్క్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమాలో కీలకరోల్‌లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు టాక్. నందమూరి తారక రత్న ఆర్ట్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రెజెంట్ చేస్తున్నాడు. ఈ సినిమా 2024 ఏప్రిల్ 5న పాన్-ఇండియాగా విడుదల కానుంది.