రాష్ట్రంలోని స్టార్టప్స్‌‌ ​కోసంజైకా రూ. 1,336 కోట్ల లోన్‌‌

రాష్ట్రంలోని స్టార్టప్స్‌‌ ​కోసంజైకా రూ. 1,336 కోట్ల లోన్‌‌

హైదరాబాద్, వెలుగు: మనరాష్ట్రంలో స్టార్టప్​ ఎకోసిస్టమ్ ​అభివృద్ధి కోసం రూ.1,336 కోట్లు ఇస్తామని జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ప్రకటించింది. ఇందుకు కేంద్రంతో మంగళవారం లోన్​  అగ్రిమెంట్​ కుదుర్చుకుంది. స్టార్టప్ ఎకోసిస్టమ్​ను పెంపొందించడం ద్వారా నిరుద్యోగం, ఆర్థికాభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యమవుతుందని తెలిపింది.

ఈ కార్యక్రమం పట్టణ పారిశ్రామికవేత్తలకు మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, ఎంటర్‌‌‌‌ప్రెనూర్లకు మద్దతునిచ్చేందుకు రూపొందించామని తెలిపింది.  జపనీస్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు తెలంగాణలోకి ప్రవేశించడంలో, వారి వ్యాపారాలకు సాయం చేయడంలో జైకా కీలక పాత్ర పోషిస్తుంది.