ప్రపంచ క్రికెట్‌లోకి జపాన్ జట్టు.. బుల్లెట్ రైలులా దూసుకెళ్తుందా

ప్రపంచ క్రికెట్‌లోకి జపాన్ జట్టు.. బుల్లెట్ రైలులా దూసుకెళ్తుందా

చైనాలోని హాంగ్జౌ వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియన్ గేమ్స్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో తొలిసారి భారత క్రికెటర్లు కూడా పాల్గొంటుండడంతో టోర్నీకే కళొచ్చింది. మొత్తం 14 జట్లు క్రికెట్ పోటీల్లో పాల్గొంటుండగా.. అందులో ఐదారు జట్లు మాత్రమే క్రికెట్ అభిమానులకు తెలిసినవి. మిగిలిన ఏడెమినిది జట్లు క్రికెట్ ఆడతాయన్నది కూడా ఎవరికి తెలియదు. అందులో జపాన్ క్రికెట్ జట్టు ఒకటి.

ఆసియా క్రీడల కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జపాన్ జాతీయ క్రికెట్ జట్టును జపాన్ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆటగాళ్ల పేర్లే మరో ప్రపంచ వింతగా అనిపిస్తున్నాయి. మ్యాచ్ జరుగుతున్న సమయంలో వీరి పేర్లు పలకడానికి కామెంటేటర్లు ఎన్ని అవస్థలు పడాలో ఏమో! సెప్టెంబరు 25న  జపాన్ జాతీయ క్రికెట్ జట్టు చైనాకు బయలుదేరి వెళ్లనుంది. 

జపాన్ జాతీయ క్రికెట్ జట్టు

కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), ర్యాన్ డ్రేక్, కజుమా కటో-స్టాఫోర్డ్, షోగో కిమురా, కౌహీ కుబోటా, వటారు మియౌచి, అలెగ్జాండర్ షిరాయ్-పాట్మోర్, డెక్లాన్ సుజుకి-మెక్‌కాంబ్, మునీబ్ సిద్ధిక్ మియాన్, సుయోషి తకడ, ఇబ్రహీం తకాహషి, మకోటో తనియామా, యాష్లే తుర్గేట్, లచ్లాన్ యమమోటో-లేక్. 

స్టాండ్ బై ప్లేయర్స్: కెంటో ఓటా-డోబెల్, మార్కస్ తుర్గేట్, జున్ యమషిత.

14 జట్లు ఏవంటే..?

ఐసీసీ ర్యాంకుల ఆధారంగా భారత్, పాకిస్తాన్, శ్రీంక, బంగ్లాదేశ్‌లు క్వార్టర్స్‌కు నేరుగా అర్హత సాధించగా.. మిగిలిన నాలుగు స్థానాల కోసం నేపాల్, మంగోలియా, జపాన్, కంబోడియా, మలేషియా, సింగపూర్, థాయ్లాండ్, మాల్దీవ్స్, హాంకాంగ్, జపాన్‌లు లీగ్ స్టేజ్ లో తలపడనున్నాయి.    

ఆసియన్ గేమ్స్ మెన్స్ క్రికెట్ షెడ్యూల్:

  • సెప్టెంబర్ 27: నేపాల్ vs మంగోలియా (గ్రూప్ ఏ)   
  • సెప్టెంబర్ 28: జపాన్ vs కంబోడియా (గ్రూప్ బి)
  • సెప్టెంబర్ 28: మలేషియా vs సింగపూర్ (గ్రూప్ సి)
  • సెప్టెంబర్ 28: మంగోలియా vs మాల్ద్వీస్ (గ్రూప్ ఏ), 
  • సెప్టెంబర్ 29: కాంబోడియా vs హాంకాంగ్ (గ్రూప్ బి)
  • సెప్టెంబర్ 29 : సింగపూర్ vs థాయిలాండ్ (గ్రూప్ సి)
  • అక్టోబర్ 1: మాల్దీవులు vs నేపాల్ (గ్రూప్ ఏ)
  • అక్టోబర్ 1: హాంకాంగ్ vs జపాన్ (గ్రూప్ బి)
  • అక్టోబర్ 2: థాయిలాండ్ vs మలేషియా (గ్రూప్ సి)
  • అక్టోబర్ 3: ఇండియా vs QF 1
  • అక్టోబర్ 3: పాకిస్తాన్ vs QF 2
  • అక్టోబర్ 4: శ్రీలంక vs QF 3
  • అక్టోబర్ 4: బంగ్లాదేశ్ vs QF 4
  • అక్టోబర్ 6(మొదటి సెమీ ఫైనల్): QF1 విజేత vs QF4 విజేత
  • అక్టోబర్ 6(రెండవ సెమీ ఫైనల్): QF2 విజేత vs QF3 విజేత
  • అక్టోబర్ 7(మూడు, నాలుగు స్థానాల కొరకు): SF 1 లూజర్ vs SF 2 లూజర్
  • అక్టోబర్ 7(ఫైనల్):   SF 1 విజేత vs  SF 2 విజేత

టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు

వన్డే వరల్డ్ కప్ 2023కు ఎక్కువ సమయం లేనందున బీసీసీఐ.. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ద్వితీయ శ్రేణి భారత జట్టును ఈ క్రీడలకు ఎంపిక చేసింది. మహిళా క్రికెట్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 19 నుంచే మొదలుకానుండగా.. పురుషుల క్రికెట్ మ్యాచ్ లు సెప్టెంబర్ 27న మొదలవునున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరుగు ఈ మ్యాచ్‌లన్నీ హాంగ్‌జౌలోని జెజియాంగ్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పింగ్‌ఫెంగ్ క్రికెట్ ఫీల్డ్‌ మైదానంలో నిర్వహించనున్నారు.