కలలో జీవిస్తున్నట్టుంది : జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా

 కలలో జీవిస్తున్నట్టుంది : జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా

న్యూఢిల్లీ : టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన అనంతరం స్వదేశంలో తనకు, ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అద్భుత స్వాగతం పలికిన అభిమానులకు స్టార్ పేసర్ జస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రీత్ బుమ్రా కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ల అభిమానం చూస్తుంటే కొన్ని రోజులుగా తాను కలలో జీవిస్తున్నట్టు అనిపిస్తోందని అన్నాడు. 30 ఏండ్ల బుమ్రా వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 15 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్​ ద టోర్నీ అవార్డు గెలిచాడు.

‘కొన్ని రోజులుగా ఇంతటి ప్రేమను, అభిమానాన్ని అందుకుంటున్నందుకు  నేను కృతజ్ఞుడను.  నేనిప్పుడు ఆనందం, కృతజ్ఞతతో నిండిన కలలో జీవిస్తున్నా’ అని బుమ్రా పేర్కొన్నాడు. ప్రధాని మోదీతో సమావేశం, విక్టరీ పరేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సన్నివేశాలు,  వాంఖడేలో జరిగిన సన్మాన సభలో విరాట్ కోహ్లీ తనను పొగిడిన ఆడియోతో కూడిన వీడియోను ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్ చేశాడు.