
భారత క్రికెట్ లో రోజుకొక ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. మొదట రోహిత్ శర్మ తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ తో షాక్ కు గురి చేయగా.. నేడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు తెలుపుతూ ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. దీంతో భారత టెస్ట్ జట్టు భవిష్యత్ గందగోళంగా మారింది. రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో హిట్ మ్యాన్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో ముందు వరుసలో ఉంటాడు. రోహిత్ టెస్ట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు వైస్ కెప్టెన్ గా బుమ్రా భారత జట్టును నడిపించాడు. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.
రోహిత్ స్థానంలో భారత కెప్టెన్ కు బెస్ట్ ఎంపిక జస్ప్రీత్ బుమ్రా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బుమ్రా టెస్ట్ కెప్టెన్సీని తిరస్కరించి సెలక్టర్లకు, బీసీసీఐకి బిగ్ షాక్ ఇచ్చినట్టు సమాచారం. కెప్టెన్‌గా వ్యవహరించడానికి ఆసక్తి లేకపోవడంతో అతను రేసు నుండి వైదొలిగాడు. అతని గాయం సమస్యలు.. పనిభారం కారణంగా ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లోని ఐదు టెస్టులూ పూర్తిగా ఆడటానికి ఈ స్టార్ పేసర్ ఆసక్తిగా లేడట.
ఫిట్‌నెస్ సమస్యల కారణంగా పూర్తి సిరీస్‌లకు అతను అందుబాటులో ఉండటం సందేహాస్పదం కావడమే ఇందుకు కారణం అవుతోంది. తనను ఫుల్ టైమ్ కెప్టెన్‌గా పరిగణించకపోవడానికి కూడా ఇదే అడ్డంకిగా మారుతోంది. బుమ్రా కెప్టెన్ కాకపోతే అతనికి వైస్ -కెప్టెన్సీ ఇవ్వడంలో అర్థం లేదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా రెండు మ్యాచ్‌లకు టీమిండియాకు కెప్టెన్సీ చేశాడు. పెర్త్‌లో సంచలన విజయాన్ని అందుకోగా సిడ్నీలో భారత్ ఓడిపోయింది. అంతకముందు 2022లో ఇంగ్లాండ్‌తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా కెప్టెన్సీ చేసిన మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది.
హిట్‌మ్యాన్ వారసుడిగా శుభ్‌మన్ గిల్ టెస్టు ఫార్మాట్‌లో కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ, టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 25 ఏండ్ల గిల్ ఇప్పటికే వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా సేవలందిస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియా టీమ్‌ను ఈ నెల మూడో వారంలో ప్రకటించనున్నారు. వచ్చే వారంలో ఇండియా–ఎ టీమ్‌ను ప్రకటించే చాన్సుంది. డొమెస్టిక్ క్రికెట్, ఐపీఎల్‌లో అదరగొడుతున్న తమిళనాడు లెఫ్టార్మ్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఇంగ్లండ్ టూర్‌కు ఎంపికవడం ఖాయమే అనిపిస్తోంది.
Jasprit Bumrah has opted out of being India's next Test captain, with Shubman Gill and Rishabh Pant now the front runners, Sky Sports News understands 🚨 pic.twitter.com/R4xG7FIigT
— Sky Sports Cricket (@SkyCricket) May 11, 2025