ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా సదానందం గౌడ్

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా సదానందం గౌడ్
  •  ప్రధాన కార్యదర్శిగా జట్టు గజేందర్ ఎన్నిక 

హైదరాబాద్, వెలుగు: స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ (ఎస్టీయూ టీఎస్) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా జి. సదానందంగౌడ్ ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా జట్టు గజేందర్ (నిర్మల్), ఆర్థిక కార్యదర్శిగా సయ్యద్ సాబేర్ అలీ (సంగారెడ్డి) ఎలెక్ట్ అయ్యారు. హైదరాబాద్​లోని ఎస్టీయూ భవన్​లో రెండ్రోజుల పాటు ఆ సంఘం స్టేట్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడారు. 

పీఆర్సీ గడువు ముగిసి రెండేండ్లయిందని, సీఎం రేవంత్ చొరవ తీసుకుని 50 శాతం ఫిట్మెంట్ తో అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే సీపీఎస్ ను రద్దు చేశాయని, మేనిఫెస్టో హామీకి కట్టుబడి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2003 టీచర్లకు ఓపీఎస్ అమలు చేయాలని కోరారు.  సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర నేతలు రవి, ఆట సదయ్య, ఏవీ సుధాకర్,  హన్మంత్ రెడ్డి, రాధ, జయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.