ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం : జావిదలీ

 ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం : జావిదలీ

సంగారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వానికి జిల్లా టీఎన్జీవోస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కేంద్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి జగదీశ్వర్ పిలుపుమేరకు కలెక్టర్​ఆఫీస్​లో పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జావిదలీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి సంఘం తరఫున పూర్తి సహకారం అందిస్తామని, ప్రభుత్వ పథకాలను ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లడంలో శక్తి వంచన లేకుండా పని చేస్తామన్నారు.

317 జీవోలో నష్టపోయిన ఉద్యోగులను తిరిగి వారి సొంత జిల్లాలకు తీసుకువచ్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, కేంద్ర సంఘం సభ్యులు నిర్మల రాజ్ కుమారి, నేతి శ్రీనివాస్, టీజీఓ అధ్యక్షుడు వైద్యనాథ్, జీపీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్, భాస్కర్, సుధాముని, శ్రీకాంత్ గౌడ్, యాదవ రెడ్డి, విజయ్ కుమార్ ఉన్నారు.